|
| పైరేట్‌ల చెర నుంచి స్టోల్ట్ వాలర్ నౌక విడుదల |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008 ( 16:23 IST ) | |
సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంటీ స్టోల్ట్ వాలర్ ఆదివారం విడుదలైంది. ఈ నౌకలో ఉన్న 18 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా సముద్రపు దొంగల చెర నుంచి బయటపడ్డారు. స్టోల్ట్ టాంకర్స్ అనే జపాన్ కంపెనీకి చెందిన ఈ నౌకను సెప్టెంబరు 15న సోమాలియా తీరానికి సమీపంలోని ఆడెన్ గల్ఫ్‌లో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
నౌకను, అందులోని సిబ్బందిని సముద్రపు దొంగలు ఆదివారం విడిచిపెట్టారని ఎన్‌యూఎస్ఐ (నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేర్స్ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ అబ్దుల్ గనీ తెలిపారు. నౌక సిబ్బంది ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. నౌకను విడిచిపెట్టడానికి కచ్చితంగా లంచం చెల్లించి ఉంటారని, అయితే ఇందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని గనీ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|