|
| రెండు రోజుల్లో దలైలామా డిశ్చార్జ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 13:14 IST ) | |
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మరో రెండు రోజుల్లో డిశార్జ్ కానున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మూత్రనాళ సంబంధ శస్త్ర చికిత్స చేయించుకున్న దలైలామా పరిస్థితి ప్రస్తుతం చక్కగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విషయమై టిబెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ దలైలామా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చక్కబడిందని ఆయనను మంగళవారం ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన దలైలామాకు లాప్రోస్కోపీ చికిత్స ద్వారా కడుపులోని రాళ్లను తొలగించినట్టు ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో ఉంటోన్న 73ఏళ్ల దలైలామా తీవ్రమైన కడుపునొప్పితో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గతవారం సాధారణ వైద్య పరీక్షల కోసం దలైలామా ఢిల్లీ చేరుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|