యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఐపీఐ పైప్ లైన్‌ నిర్మాణానికి పాక్, ఇరాన్ సిద్ధం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 10:41 IST )
ఇరాన్ నుంచి పాకిస్థాన్, భారత్‌ల వరకు నిర్మించ తలపెట్టిన ఐపీఐ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి మోక్షం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ పైప్ లైన్ నిర్మాణానికి భారత్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తెలపకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తామే చేపట్టాలని ఇరాన్, పాకిస్థాన్‌లు నిర్ణయించాయి.

ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ, ఇరాన్ తరపున మొటాకీలు ఐపీఐ పైప్ లైన్ నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న పాకిస్థాన్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ ఐపీఐ ప్రాజెక్టు‌ను కొనసాగిస్తామని తెలిపారు.

ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఈ ప్రాజెక్ట్ వాయిదా పడే ప్రసక్తే లేదని వారు తెలిపారు. ఇరు దేశాలు నిర్మించ తలబెట్టిన ఈ ఐపీఐ ప్రాజెక్ట్ 7.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించనుండడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్‌లో భారత్ కూడా ఓ భాగస్వామి కాగా ఎందుకో ఈ విషయంలో భారత్ ప్రారంభం నుంచి కాస్త ఉదాసీనత ప్రదర్శిస్తుండడం తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
123 ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకం
మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్ అణు కాంప్లెక్స్‌లో ప్రమాద భీతి
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...