యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
123 ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకం
వాషింగ్టన్ (ఏజెన్సీ), 11 అక్టోబర్ 2008   ( 09:10 IST )
భారత్, అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందం అమలులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన 123 అగ్రిమెంట్‌పై భారత్, అమెరికా దేశాలు శుక్రవారం సంతకాలు చేశాయి. అమెరికాలో జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌లు 123 ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ అమెరికాతో కుదిరిన ఈ అణు ఒప్పందం కారణంగా రానున్న మూడు దశాబ్ధాల్లో అమెరికా కంపెనీలు భారత అణు మార్కెట్‌లోకి రంగప్రవేశం చేస్తాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాలకు సంబంధించి ఇదో ముఖ్యమైన రోజని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ప్రపంచ ఇంధన అవసరాలు, ప్రకృతి సంబంధ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ అణు ఒప్పందం ఇరు దేశాలకు ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై అమెరికా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్, అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని అమలులోకి తెచ్చేందుకు ఉపకరించే మొదటి దశగా ఈ 123 ఒప్పందాన్ని పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్ అణు కాంప్లెక్స్‌లో ప్రమాద భీతి
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...