యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
జపాన్ అణు కాంప్లెక్స్‌లో ప్రమాద భీతి
టోక్యో (ఏజెన్సీ), 10 అక్టోబర్ 2008   ( 15:23 IST )
జపాన్‌లోని తాకైమురా అణు విద్యుత్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ప్రమాద భీతి నెలకొంది. ఈ కాంప్లెక్స్‌లో పొగ బయటకిరావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దశాబ్దం క్రితం ఇదే కాంప్లెక్స్‌లో భారీ ప్రమాదం సంభవించింది. తాజాగా తొకైమూరా ప్లాంట్‌లోని ఘన వ్యర్థాల కేంద్రం నుంచి పొగ బయటకి వచ్చినట్టు అధికారికవర్గాలు తెలిపాయి.

అయితే ఈ సందర్భంగా ఎటువంటి రేడియాధార్మికత వెలువడలేదని జపాన్ అటామిక్ పవర్ కార్పొరేషన్ ప్రతినిధులు వెల్లడించారు. జపాన్ రాజధాని టోక్యోకు ఈశాన్య దిశలో 70 మైళ్ల దూరంలో ఈ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో ఘన వ్యర్థాలను కాల్చివేసే గదిలో పొగ బయటకు వచ్చిందని తెలిపారు. దీని వలన ఎవరూ గాయపడలేదని చెప్పారు.

అణు రియాక్టర్లు ఈ కాంప్లెక్స్‌లోని వేరొక భాగంలో ఉన్నాయన్నారు. రియాక్టర్లు యథాతథంగా పని చేస్తున్నాయని చెప్పారు. పొగ బయటకు రావడంపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. 1999లో తోకైమురా ఇంధన రీప్రాసెసింగ్ సెంటర్‌లో అనియంత్రిత అణు చర్య కారణంగా సంభవించిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 700 మందిపై రేడియాధార్మికత ప్రభావం పడింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి
జార్జియా, రష్యా మధ్య మరో సైనిక వివాదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...