యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
ఖాట్మండు (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 15:03 IST )
నేపాల్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపే బృందంలో జర్మనీ విమానయాన శాఖ నిపుణులు కూడా వచ్చి చేరారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని లుక్లా ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ హెలికాఫ్టర్ కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల విచారణ కమిటీకి జర్మనీ నిపుణులు సాయం చేస్తారని శుక్రవారం అధికారులు తెలిపారు. బుధవారం యేటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్ లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. సరిగా కనిపించకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన 18 మందిలో 12 మంది జర్మనీ పర్యాటకులు ఉన్నారు. మరో ఇద్దరు ఆస్ట్రేలియన్లు కాగా, మిగిలిన నలుగురు నేపాలీయులు. ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ పైలెట్ ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్ ప్రస్తుతం ఖాట్మండులోని త్రిభువన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి
జార్జియా, రష్యా మధ్య మరో సైనిక వివాదం
ఇస్లామాబాద్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...