|
| ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్ |
| స్టాక్‌హోమ్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 12:25 IST ) | |
ఫ్రెంచ్ నవలా రచయిత జీన్- మేరీ గుస్తావే లె క్లెజియో సాహిత్యంలో 2008 సంవత్సరానికిగాను నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహసోపేతమైన నవలలు, వ్యాసాల రచనతోపాటు, పిల్లల సాహిత్యంలో లె క్లెజియో చేసిన కృషికి ఫలితంగా స్వీడిష్ అకాడమీ, ఆయనకు ఈ బహుమతిని ప్రకటించింది. అకాడమీ ఆయనకు 1.4 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని అందజేయనుంది.
1985 తరువాత ఫ్రెంచ్ రచయిత ఒకరు సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికవడం ఇదే తొలిసారి. 1985లో క్లాడ్ సైమన్ అనే రచయిత చివరిసారి ఫ్రాన్స్‌కు నోబెల్ పురస్కారాన్ని అందించారు. చైనాలో పుట్టి ఫ్రాన్స్‌లో ఆశ్రయం తీసుకుని ఫ్రెంచ్ పౌరుడిగా స్థిరపడిన గావో జింజియాన్ కూడా 2000 సంవత్సరంలో ఫ్రాన్స్ తరపున నోబెల్ అవార్డు అందుకున్నారు.
తాజాగా లె క్లెజియోకు సాహిత్యంలో నోబెల్ అవార్డు ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ ఆయన రచనల్లోని నవ్యత్వాన్ని, కవితా సాహసికత్వాన్ని, నాగరికతకు ముందూ తర్వాతా మానవత్వ అన్వేషణా స్ఫూర్తిని కొనియాడింది. 1940లో జన్మించిన లె క్లాజియో తొలి నవల "లె ప్రాసెస్- వెర్బల్" ("ది ఇంటరాగేషన్") ఆయన 23వ ఏట ప్రచురితమైంది.
ప్రారంభ దశలో (1960, 1970 దశకాల్లో) ఆయన సాంప్రదాయవాదాన్ని సవాలు చేస్తూ పరిశోధనాత్మక రచనలు చేసేవారు. "ఫివర్" (1965), "ది ఫ్లడ్" (1966) రచనలు ఈ కోవలోనివే. "డిజర్ట్" అనే నవల సాహిత్యంలో ఆయనకు ఎంతో పేరును ఆర్జించిపెట్టింది. 1980లో వచ్చిన ఈ నవల ద్వారా లె క్లెజియోకు ఫ్రెంచ్ అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|