|
| పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 09:50 IST ) | |
పాకిస్థాన్ భూభాగంలో అమెరికా సేనలు మరోసారి క్షిపణి దాడి జరిపినట్టు గురువారం వార్తలు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్ గిరిజన ప్రాంతంలోని రెండు ప్రదేశాలపై జరిగిన అనుమానిత అమెరికా క్షిపణి దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థల అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నెల రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మాహుతి దాడితో ఉలిక్కిపడింది. గురువారం ఇస్లామాబాద్‌లోని తీవ్రవాద నిరోధక ధళ భవనాన్ని, మరొక ప్రాంతంలో పోలీసు వ్యానును లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు జరిపిన రెండు బాంబు దాడుల్లో పది మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
ఇస్లామాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని తీవ్రవాద నిరోధక దళ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఆత్మాహుతి దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఉన్న ఎగువ దిర్ జిల్లాలో పోలీసు వ్యానును లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు రోడ్డుపక్కన బాంబును అమర్చి పేల్చారు. ఈ బాంబు పేలుడులో పది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
తీవ్రవాదులకు లక్ష్యంగా చేసుకున్న వ్యానులో పోలీసులు ఖైదీలను తీసుకొని వెళుతున్నారు. ఈ పేలుడులో పాఠశాల విద్యార్థుల బస్సు కూడా చిక్కుకుందని వార్తలు వచ్చాయి. రిమోట్ సాయంతో తీవ్రవాదులు ఈ వాహనాన్ని పేల్చివేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, నలుగురు పోలీసు సిబ్బంది, ముగ్గురు ఖైదీలు మరణించారని స్థానికాధికారి ఒకరు చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|