|
| జార్జియా, రష్యా మధ్య మరో సైనిక వివాదం |
| కరలేటి (ఏజెన్సీ), 9 అక్టోబర్ 2008 ( 17:28 IST ) | |
జార్జియా నుంచి వేర్పడిన దక్షిణ ఒసెటియా వెలుపలి భాగం నుంచి రష్యా తన దళాలు ఉపసంహరించుకున్నప్పటికీ, వివాదాస్పద ప్రాంతాల నుంచి మాత్రం దళాలను ఉపసంహరించలేదు. దీంతో జార్జియా, రష్యాల మధ్య మరోసారి సైనిక వివాదం రాజుకుంది. దక్షిణ ఒసెటియాను తిరిగి ఆక్రమించేందుకు జార్జియా ప్రయత్నించడంతో, ఇరుదేశాల మధ్య ఆగస్టులో సైనిక పోరు జరిగిన సంగతి తెలిసిందే.
దక్షిణ ఒసెటియా వెలుపలి ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి షోతా ఉతియాష్విలీ గురువారం వ్యాఖ్యానించారు. అయితే దళాల ఉపసంహరణ పూర్తి స్థాయిలో జరిగినట్టు జార్జియా పరిగణించాలంటే, దక్షిణ ఒసెటియా సమీపంలోని అఖాల్‌గోరి పట్టణం, అబ్‌ఖాజియాలోని కొదోరి జార్జి నుంచి రష్యా తన దళాలను వెనక్కు పిలిపించాలని డిమాండ్ చేశారు.
అబ్‌ఖాజియా కూడా దక్షిణ ఒసెటియా మాదిరిగానే జార్జియా నుంచి వేర్పడిన ప్రావీన్స్ కావడం ఇక్కడ గమనార్హం. అబ్‌ఖాజియాకూ రష్యా మద్దతు కొనసాగుతుంది. తాజాగా దళాలను ఉపసంహించాలని రష్యా తీసుకున్న నిర్ణయాన్ని జార్జియా ప్రతినిధి స్వాగతించారు. అయితే ఈ దళాల ఉపసంహరణ పూర్తిస్థాయిలో జరిగిందని తాము ఇప్పుడే అంగీకరించలేమన్నారు. అఖాల్‌గోరి దక్షిణ ఒసెటియాలో, కొడోరి ప్రాంతం అబ్‌ఖాజీయాలో భాగాలని, సైనిక దళాల ఉపసంహరణ పూర్తి చేశామని రష్యా చేస్తున్న ప్రకటనలను జార్జియా ఈ సందర్భంగా తోసిపుచ్చింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|