యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇస్లామాబాద్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 16:44 IST )
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నెల రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మాహుతి దాడితో ఉలిక్కిపడింది. గురువారం ఇస్లామాబాద్‌లోనితీవ్రవాద నిరోధక ధళ భవనాన్ని, మరొక ప్రాంతంలో పోలీసు వ్యానును లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు జరిపిన రెండు బాంబు దాడుల్లో పది మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.

ఇస్లామాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని తీవ్రవాద నిరోధక దళ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఆత్మాహుతి దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఉన్న ఎగువ దిర్ జిల్లాలో పోలీసు వ్యానును లక్ష్యంగా చేసుకొని రోడ్డుపక్కన బాంబు అమర్చి పేల్చారు. ఈ బాంబు పేలుడులో పది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

తీవ్రవాదులకు లక్ష్యంగా చేసుకున్న వ్యానులో పోలీసులు ఖైదీలను తీసుకొని వెళుతున్నారు. ఈ పేలుడులో పాఠశాల విద్యార్థుల బస్సు కూడా చిక్కుకుందని వార్తలు వస్తున్నాయి. రిమోట్ సాయంతో తీవ్రవాదులు ఈ వాహనాన్ని పేల్చివేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, నలుగురు పోలీసు సిబ్బంది, ముగ్గురు ఖైదీలు మరణించారని స్థానికాధికారి ఒకరు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్వాత్ లోయలో పాక్ వైమానిక దళం దాడులు
పాల కల్తీ: చైనాలో 10,700 బాలలకు అస్వస్థత
ఊపందుకున్న ఉ కొరియా క్షిపణి పరీక్షలు
అణు ఒప్పందం బిల్లుపై జార్జి బుష్ సంతకం
నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి
బేనజీర్ హత్యపై దర్యాప్తు జరపలేము: ఐరాస
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...