|
| స్వాత్ లోయలో పాక్ వైమానిక దళం దాడులు |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008 ( 12:22 IST ) | |
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో ఒక తీవ్రవాద స్థావరంపై ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్‌లు గురువారం దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రవాద స్థావరం పూర్తిగా ధ్వంసం అయిందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్వాత్ లోయలోని పియోచార్ గ్రామంలో ఈ వైమానిక దాడి జరిగింది. గత ఏడాది నుంచి ఈ గ్రామంలోని తీవ్రవాద స్థావరంపై దాడులు జరుగుతూనే ఉండటం గమనార్హం. దాడిలో మృతి చెందిన తీవ్రవాదుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని పాక్ అధికారులు తెలిపారు. తీవ్రవాద స్థావరం పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ దాడి విజయవంతం అయిందని చెప్పారు.
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయ ఒకప్పుడు అందమైన పర్యాటక ప్రాంతం. ఇప్పుడు అది తీవ్రవాదులకు అడ్డా. తాలిబాన్ మద్దతుదారుడైన మతపెద్ద మౌలానా ఫాజ్లుల్లా అతివాద ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడంతో ఈ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబాన్లు, అల్‌ఖైదా తీవ్రవాదులకు ఈ ప్రాంతం స్వర్గధామంగా మారినట్టు పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|