యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాల కల్తీ: చైనాలో 10,700 బాలలకు అస్వస్థత
బీజింగ్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 12:08 IST )
చైనాలో కల్తీ పాలు, పాల ఉత్పత్తులు సేవించి భారీ సంఖ్యలో పిల్లలు అనారోగ్యం పాలైయ్యారు. వీరిలో ఇప్పటికీ సుమారు 10,700 మంది శిశువులు, పిల్లలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంతకుముందు సెప్టెంబర్ 21న పాల కుంభకోణానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో చైనా ఆరోగ్య శాఖ 12,892 బాలలు కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

చైనాలోని పలు కంపెనీలు ఉత్పత్తి చేసిన పాల ఉత్పత్తుల్లో మిలామిన్ అనే ప్రమాదకర రసాయనం కలవడంతో ఈ విపత్తు సంభవించింది. బుధవారానికి కల్తీ పాలు సేవించి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లల సంఖ్య 10,666 వద్ద ఉందని చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరో 36,144 మంది బాలలు ఆస్పత్తుల నుంచి డిచ్చార్జ్ అయ్యారు. చైనాలో కల్తీ పాలు సేవించి సుమారు 94 వేల మంది బాలలు అనారోగ్యం పాలైనట్టు అనధికారిక సమాచారం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఊపందుకున్న ఉ కొరియా క్షిపణి పరీక్షలు
అణు ఒప్పందం బిల్లుపై జార్జి బుష్ సంతకం
నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి
బేనజీర్ హత్యపై దర్యాప్తు జరపలేము: ఐరాస
థాయ్‌ ఉప ప్రధాని చావలిత్ రాజీనామా
అణు ఒప్పందంపై రేపు బుష్ సంతకం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...