యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అణు ఒప్పందం బిల్లుపై జార్జి బుష్ సంతకం
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 09:17 IST )
భారత్‌తో కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందం అమలు కోసం ఉద్దేశించిన బిల్లుపై వైట్‌హోస్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సంతకం చేశారు. అణు ఒప్పందం బిల్లుపై ఆమోదముద్ర వేసిన సందర్భంగా భారత్‌కు విశ్వసనీయ అణు సరఫరాదారుగా ఉంటామని బుష్ హామీ ఇచ్చారు. అణు ఒప్పందం బిల్లు ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

123 ఒప్పందానికి, ఇప్పుడు ఆమోదించిన బిల్లుకు ఎలాంటి వైరుధ్యంలేదని బుష్ తెలిపారు. ఈ అణు ఒప్పందాన్ని అమల్లోకి తెస్తూ భారత్, అమెరికాలు శుక్రవారం సంతకాలు చేయనున్నాయి. దీంతో బుష్, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జులై 18, 2005న ప్రతిపాదించిన ఈ పౌర అణు సహకార ఒప్పందం అమల్లోకి వస్తుంది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్, భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సంతకాలు చేస్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి
బేనజీర్ హత్యపై దర్యాప్తు జరపలేము: ఐరాస
థాయ్‌ ఉప ప్రధాని చావలిత్ రాజీనామా
అణు ఒప్పందంపై రేపు బుష్ సంతకం
ఇరాన్‌పై దాడిని అనుమతించం: అమెరికా
టిబెట్‌లో భూకంపాలు: 30 మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...