|
| ముషారఫ్ భవితవ్యంపై పాక్ నేతల నిర్ణయం వాయిదా |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 20 ఆగస్టు 2008 ( 11:06 IST ) | |
ముషారఫ్ భవితవ్యంపై ఒక నిర్ణయం తీసుకోవడంలో పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ముషారఫ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మంగళవారం పాక్ సంకీర్ణ ప్రభుత్వ అగ్రనేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో నేతలు ముషారఫ్ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీల అగ్రనేతలు అసిఫ్ అలీ జర్దారీ, నవాజ్ షరీఫ్, ఇతర భాగస్వామ్యపక్షాల అగ్రనేతలు మంగళవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సోమవారం పాకిస్థాన్ అధ్యక్షుడు రాజీనామా చేసిన అనంతరం సంకీర్ణ ప్రభుత్వ నేతలు సమావేశం కావడం ఇది రెండోసారి.
గత ఏడాది ముషారఫ్ తొలగించిన న్యాయమూర్తుల పునర్నియామకం, ముషారఫ్ భవిష్యత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు వీరు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముషారఫ్‌ను సురక్షితంగా వెళ్లనివ్వడంపై చర్చలు జరుగుతాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు ఈ అంశంపై చర్చలు జరపలేదని తెలిసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|