యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాకిస్థాన్ ఆస్పత్రిపై బాంబు దాడి: 20 మంది మృతి
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 17:58 IST )
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలోని ఒక పట్టణ ఆస్పత్రిపై మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. దేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలో ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఆస్పత్రి లోపల తననితాను పేల్చుకున్నాడు.

దేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణ స్థానిక అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద ఈ దాడి జరిగింది. వర్గవైషమ్యాలతో జరిగిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందాడని అనుమానిస్తూ, దానికి నిరసన తెలిపేందుకు కొంతమంది షియా ముస్లింలు ఆస్పత్రిలో గుమిగూడారు. వీరిని లక్ష్యంగా చేసుకొనే ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దాడిలో గాయపడినవారిలో ఒక సీనియర్ పోలీసు అధికారి, పలువురు భద్రతా సిబ్బంది ఉన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాడి జరిగిన అనంతరం స్థానిక మార్కెట్, వ్యాపార కేంద్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ప్రజలను బయటకురావొద్దని సూచించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ తాత్కాలిక అధ్యక్షునిగా సూమ్రో బాధ్యతల స్వీకరణ
ముషారఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: గిలానీ
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం: ప్రణబ్
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...