యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్ తాత్కాలిక అధ్యక్షునిగా సూమ్రో బాధ్యతల స్వీకరణ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 13:04 IST )
పాకిస్థాన్ తాత్కాలిక అధ్యక్షునిగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ స్పీకర్ మొహమ్మెద్‌మియాన్ సూమ్రో వ్యవహరిస్తారు. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (65) తన సుదీర్ఘ అధ్యక్ష ప్రస్తానానికి సోమవారం ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

జాతినుద్దేశించి సోమవారం అధ్యక్ష హోదాలో ముషారఫ్ చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా దేశాధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్టు ముషారఫ్ ప్రకటించారు. అనంతరం జాతీయ అసెంబ్లీ స్వీకర్‌కు రాజీనామా లేఖను పంపించారు.

ముషారఫ్ రాజీనామా చేసిన వెంటనే పాకిస్థాన్ పార్లమెంట్ ఎగువ సభ ఛైర్మన్ సూమ్రో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షనిగా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌లో సెనెట్ ఛైర్మన్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ప్రమాణస్వీకారం అవసరం ఉండదు.

ఇదిలా ఉంటే అధ్యక్ష పీఠం, ప్రభుత్వం మధ్య సంఘర్షణను నివారించేందుకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు మాజీ సర్వసైన్యాధ్యక్షుడు ముషారఫ్ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. తనపై సంకీర్ణ ప్రభుత్వం మోపిన వివిధ ఆరోపణలను ముషారఫ్ ఖండించారు. ఈ నిందలను ఎవరూ నిరూపించలేరన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముషారఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: గిలానీ
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం: ప్రణబ్
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...