యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
ఖాట్మండు (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 16:49 IST )
గణతంత్ర నేపాల్ తొలి ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్‌లో రాచరిక పాలనకు పూర్తిగా తెరపడిన అనంతరం ప్రపండ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదిలా ఉంటే నేపాల్ మంత్రివర్గ పదవులపై మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య విభేదాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలివున్నాయి.

దేశానికి, దేశ ప్రజలపట్ల నిజాయితీగా వ్యవహరిస్తానని ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రచండ హామీ ఇచ్చారు. సోమవారం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రచండను నేపాల్ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్ రాష్ట్రపతి నివాసమైన శీతల్ నివాస్‌కు ఆహ్వానించారని అధికారికవర్గాలు తెలిపాయి.

మరోవైపు పదవులపై ఏకాభిప్రాయ సాధనకు రాజకీయ పార్టీలు ఆదివారం చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. సీపీఎన్- మావోయిస్టు, సీపీఎన్- యూఎంఎల్, మాదేశీ పీపుల్స్ రైట్స్ ఫోరమ్ మధ్య శుక్ర, శనివారాల్లో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సంకీర్ణ ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని తయారు చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ
నేడు నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
ఎన్ఎస్‌జీ: భారత్ అణు ఒప్పందానికి స్విస్ మద్దతు
నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...