యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 14:58 IST )
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సోమవారం రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల నుంచి ఒత్తిళ్లు బాగా పెరగడంతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ముషారఫ్ ప్రకటించారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం తాను అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ముషారఫ్ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు.

తానెవరి నుంచి ఏమీ ఆశించడం లేదని ముషారఫ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలను న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేలా చూద్దామన్నారు. ఏం చేసినా దేశం కోసమే చేశాననే నమ్మకంతో దిగిపోతున్నానని ముషారఫ్ చెప్పారు. మరికొద్ది సేపట్లో జాతీయ అసెంబ్లీకి తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు వెల్లడించారు.

రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా ముషారఫ్ ఉద్వేగానికి లోనయ్యారు. జాతీయ అసెంబ్లీలో పాక్ సంకీర్ణ ప్రభుత్వం తనపై ప్రవేశపెట్టాలనుకున్న అభిశంసన తీర్మానం వీగిపోయినప్పటికీ, అధ్యక్షునికి- ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ముషారఫ్ తెలిపారు. ఈ పరిస్థితి న్యాయవ్యవస్థ, పార్లమెంట్ మధ్య విభేదాలకు తావిస్తుందని, ఆర్మీని కూడా ఈ వివాదంలోకి లాగే పరిస్థితి వస్తుందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ నానాటికీ పతనావస్థకు చేరువ అవుతుండటం విచారం కలిగిస్తోందన్నారు. దీని ప్రభావం దేశంలో పేద ప్రజలపై పడుతోందని వెల్లడించారు. ఇటీవల దేశంలో జరిగిన అభిప్రాయసేకరణ ఫలితాలను ముషారఫ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 80 శాతం మంది ప్రజలు తనను అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయిప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. దీని వలన దేశంలో ఇకపై అనిశ్చితి ఉండబోదని ముషారఫ్ వ్యాఖ్యానించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ
నేడు నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
ఎన్ఎస్‌జీ: భారత్ అణు ఒప్పందానికి స్విస్ మద్దతు
నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి
ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...