|
| పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 12:55 IST ) | |
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తరువాత ఆ బాధ్యతలను ఒక మహిళ స్వీకరించే అవకాశం ఉందని పీపీపీ చీఫ్ అసిఫ్ అలీ జర్దారీ తెలిపారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పీపీపీ అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములతో ఏకాభిప్రాయం సాధించిన అనంతరం అధ్యక్ష పదవి అభ్యర్థిపై ఒక నిర్ణయం తీసుకుంటామని జర్దారీ వెల్లడించారు. అధ్యక్ష పీఠం రేసులో తాను కూడా ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని జర్దారీ ఖండించారు. తాను ఈ రేసులో లేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ముషారఫ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం వ్యవస్థలోనూ, జాతీయ రాజకీయాల్లో, విదేశాంగ విధానంలో మార్పులు ఉంటాయని జర్దారీ సూచనప్రాయంగా చెప్పారు. ఏఆర్‌వై న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జర్దారీ ఈ విషయాలు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|