|
| నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి |
| ఖాట్మండు (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 10:40 IST ) | |
నేపాల్ ఉపాధ్యక్షుడు పర్మానంద ఝా నివాసం వద్ద ఆదివారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక సైనికుడితోపాటు ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి నుంచి పర్మానంద సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం వద్ద ఉన్న గౌరిఘాట్‌లో నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసం ఉంది. ఈ దాడిలో ఇంటిలోని కొంతభాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ దాడిని తామే చేశామని రాష్ట్రీయ ముక్తి సేన ప్రకటించింది. దాడి అనంతరం ఈ ప్రదేశంలో భద్రతను పటిష్ట పరిచారు.
నేపాల్ ఉపాధ్యక్షునిగా ఝా గత నెలలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రహస్యంగా ప్రమాణస్వీకారం హిందీలో చేయడం నేపాల్‌లో వివాదాస్పదమైంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా జరిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|