|
| ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 17 ఆగస్టు 2008 ( 11:59 IST ) | |
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం కల్లా రాజీనామా చేయాలని పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం గడువు విధించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంట్‌లో వచ్చేవారం జరిగే అభిశంసనకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ముషారఫ్‌కు అన్నివైపులా దారులు మూసుకుపోవటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముషారఫ్‌కు కాలం సమీపిస్తుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు.
ముషారఫ్ సాగనంపేదానిపై పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ కియానీతో ప్రభుత్వం చర్చలు జరిపిందన్న వాదన నిజం కాదన్నారు. తన అధికారానికి తగ్గట్టు గౌరవాలు ప్రభుత్వం కల్పించకపోతే పాకిస్థాన్‌లో ఉండనని ముషారఫ్ స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి.
పర్వేజ్ ముషారఫ్‌కు చట్టబద్దంగా ఆయనకు రక్షణ కల్పించే ఉద్దేశం లేదని పాకిస్థాన్ ముస్లిం లీగ్ -నవాజ్ వర్గ పార్టీ (పీఎంఎల్-ఎన్) నేత సిద్దిఖీ ఉల్ ఫరూఖ్ చెప్పారు. ముషారఫ్‌పై సమగ్ర ఛార్జిషీటును సంకీర్ణ కూటమి ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. అభిశంసన మరి కొద్ది రోజుల్లోనే మొదలవుతుందని ఫరూఖ్ ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడ్డారని ముషారఫ్‌పై ఫరూఖ్ మండిపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|