|
| ఇండోనేసియాలో రైలు ప్రమాదం: 8మంది దుర్మరణం |
| జకార్తా, శనివారం, 16 ఆగస్టు 2008 ( 16:50 IST ) | |
ఇండోనేషియాలోని లాంపుంగ్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. మరో 60మంది గాయపడ్డారు. ప్రయాణీకుల రైలు ఆగిఉన్న గూడ్సు రైలును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు అన్నారు. లీమెక్స్ శ్రివిజయ ప్రయాణీకుల రైలు 300 మందితో ముందుకుసాగుతుంది.
రైళ్లు ఢీకొన్న ప్రమాదం కారణంగా అక్కడ చెల్లాచెదురుగా రైలు బోగీలు పడిపోయాయి. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమైనారు. రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇండోనేసియాలో రైల్వే మౌలిక సదుపాయాలు అంతంతమాత్రం కావటంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|