|
| ఆర్మీ ఛీఫ్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు! |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008 ( 15:14 IST ) | |
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ వ్యవహారంపై ఆర్మీ ఛీప్ కియానీతో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు జరపటానికి సిద్ధమౌతుంది. ముషారఫ్‌తో ఒక ఒప్పందం చేసుకుని రాజకీయ సంక్షోభాన్ని అధిగమించాలని పీపీపీ, పీఎంఎల్-ఎన్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
పర్వేజ్ ముషారఫ్ అభిశంసనకు ముందుగానే రాజీనామా చేయకపోతే రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరం కానుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ముషారఫ్ అభిశంసన వచ్చే మూడు రోజుల్లోపు పూర్తవుతుందని ప్రకటించారు. లేనిపక్షంలో ఆర్మీ ఛీప్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
చట్టబద్ధంగా ఎన్నికైన కారణంగా తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించారు. తన పదవీ కాలం ముగిసేంతవరకూ ఆ పదవిలో కొనసాగుతానని ముషారఫ్ స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|