యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పరిశ్రమలు తెరిపిస్తాం: నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ
ఖాట్మండు (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 12:58 IST )
మావోయిస్టుల హెచ్చరికల కారణంగా దేశంలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపిస్తామని నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ ప్రకటించారు. నేపాల్ తూర్పు ప్రాంతంలో రహదారులపై రాకపోకలు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన కారణంగా వందలాది సంఖ్యలో రవాణా, ప్రయాణీకుల వాహనాలు ఆగిపోయాయని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ మార్గంలో భద్రతను పెంచుతుందన్నారు.

నేపాల్‌లోకి రావలిసిన నిత్యావసర సరుకులు మార్గమధ్యంలో నిలిచిపోవడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న దానిపై తాము దృష్టిపెట్టామని తెలిపారు. నేపాల్‌కు ప్రధానంగా సరుకుల రవాణా భారత్ వైపు నుంచి జరుగుతుందన్నారు.

జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేపాల్‌లో పరిశ్రమల అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. నేపాల్ అన్ని రంగాల్లో అభివృద్థి చెందాలన్నదే తమ అభిమతమని మనసులో మాట చెప్పారు. నేపాల్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడమని ప్రచండ స్పష్టం చేశారు.

ఫెడరేషన్ ఆఫ్ నేపాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కుష్ కుమార్ నేపాల్ కొత్త ప్రధానమంత్రి ప్రచండను శనివారం కలుసుకున్నారు. దేశ రాజధాని ఖాట్మండులోని ప్రధాని నివాసమైన బలువతర్‌లో వీరిద్దరూ చర్చలు జరిపారు. కుమార్ వెంట నేపాల్ వ్యాపారవేత్తల బృందం కూడా వచ్చారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హెచ్-2B వీసాలో మార్పులకు ప్రతిపాదన: యూఎస్
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భారత్‌కు బుష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్‌తో మెరుగైన సంబంధాలకు కట్టుబడి ఉన్నాం: గిలానీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...