యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 11:05 IST )
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. జార్జియాతో మెరుగైన సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే రష్యా ఈ పని చేయాలని అమెరికా అధ్యక్షుడు జార్జి వాకర్ బుష్ చెప్పారు. పొరుగుదేశాల స్వేచ్ఛను రష్యా గుర్తించి మెలగాలని కోరారు. అమెరికా, జార్జియాలతో పాటుగా తమ మిత్ర దేశాలు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత నిస్తాయన్నారు.

జార్జియా పరిసర ప్రాంతాల నుంచి రష్యా వెనక్కు తగ్గుతుందని బుష్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలు పొరుగు దేశాలను మిత్రులుగా భావిస్తుందన్నారు. జార్జియా సంక్షోభం గురించి జీ-7 దేశాలతో తాము చర్చలు జరుపుతున్నామని వివరించారు.

స్వేచ్ఛా దేశాల విషయంలో రష్యా వైఖరి సరైంది కాదని బుష్ అన్నారు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగించటంలో రష్యా విఫలమవుతుందన్నారు. జార్జియాలో సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొంటాయని బుష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భారత్‌కు బుష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్‌తో మెరుగైన సంబంధాలకు కట్టుబడి ఉన్నాం: గిలానీ
భవిష్యత్‌పై ముష్ మౌనం: వేటుకు మరో ప్రావీన్స్ మద్దతు
జార్జియా హింసాకాండ: 74 మంది రష్యా సైనికుల మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...