యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
ఖాట్మండూ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 09:14 IST )
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా మావోయిస్టు ఛీఫ్ ప్రచండ కమల్ దహాల్ ఎన్నికయ్యారు. రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి నేపాల్ అడుగుపెట్టిన తర్వాత తొలి ప్రధానిగా ప్రచండ రికార్డుకెక్కారు. నేపాల్ అసెంబ్లీలో ఓటింగ్ జరగ్గా ప్రచండకు అనుకూలంగా 464 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత కొత్త ప్రధానమంత్రి ఎన్నిక జరగడం విశేషం. నేపాల్ అసెంబ్లీలో మొత్తం 601 స్థానాలు ఉండగా, 577 మంది సభ్యులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ప్రచండ కమల్ దహాల్ వయస్సు 53 సంవత్సరాలు. మావోయిస్టు సీపీఎన్ పార్టీకి ఛీఫ్‌గా ప్రచండ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. నేపాల్ రాచరికానికి వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీ తరపున ప్రచండ పోరు అలుపులేని పోరు జరిపారు. ఈ సమయంలో అనేక ఒత్తిళ్లను ప్రచండ ఎదుర్కొన్నారు.

నేపాల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో ప్రచండకు పోటీగా నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ ద్యూబా బరిలోకి దిగారు. ద్యూబాకు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రచండకు మద్దతు పలికిన పార్టీల్లో సీపీఎన్ (యూఎంఎల్), మాధేశీ జనాధికార్ ఫోరం (ఎంజేఎఫ్) లు ఉన్నాయి.

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి జీపీ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశారు. నేపాలీ కాంగ్రె‌స్‌కు చెందినవారు కొయిరాలా. ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీలు తొమ్మిది కీలక మంత్రి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి శాఖలు ఉంటాయని నేపాల్ అధికార వర్గాలు అంటున్నాయి.

కొత్త ప్రధానమంత్రి ప్రచండ కమల్ దహాల్ భారత్‌ సరిహద్దు సమీపంలోని పోఖారా నగరంలో రైతు కుటుంబంలో జన్మించారు. ప్రచండ అసలు పేరు పుష్ప కమల్ దహాల్. ప్రాథమిక విద్యను పోఖారాలో పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించటానికి ఖాట్మండూ పయనమయ్యారు.

మావోయిస్టు ఉద్యమంలో ప్రచండ 1971లో చేరారు. 1995 నాటికి జనరల్ సెక్రటరీ, 2000 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌కు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ప్రచండ 1980 నుంచి 2005 వరకూ ప్రజలకు దూరంగా ఉన్నారు. పాతికేళ్ల నాటి శ్రమ నేడు ఆయనకి కలిసివచ్చింది. మాజీ ప్రధాని ద్యూబా పరిపాలనా కాలంలో మావోయిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేశారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భారత్‌కు బుష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్‌తో మెరుగైన సంబంధాలకు కట్టుబడి ఉన్నాం: గిలానీ
భవిష్యత్‌పై ముష్ మౌనం: వేటుకు మరో ప్రావీన్స్ మద్దతు
జార్జియా హింసాకాండ: 74 మంది రష్యా సైనికుల మృతి
కాశ్మీర్‌పై పాక్ స్పందన: భారత్ తీవ్ర అభ్యంతరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...