|
| నేపాల్‌లో జంట బాంబుపేలుళ్లు: ఆరుగురికి గాయాలు |
| ఖాట్మండూ (ఏజెన్సీ), 7 ఆగస్టు 2008 ( 18:04 IST ) | |
నేపాల్‌లో జంట బాంబుపేలుళ్లు బుధవారం చోటుచేసుకోగా ఆరుగురు గాయపడ్డారు. పశ్చిమ నేపాల్‌లోని పొఖరా ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో బాంబుపేలుళ్ల కారణంగా భయానక వాతావరణం నెలకొంది.
పొఖరాలోని సభాగృహా చౌక్‌లో జంట బాంబుపేలుళ్లు 30 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్నాయని పోలీసు వర్గాలు తెలిపారు. గాయపడినవారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని వివరించారు. పొఖరాలో జరిగిన పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించలేదని చెప్పారు.
పేలుళ్లలో గాయపడ్డవారిని పొఖరా స్థానిక ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు వెల్లడించారు. నేపాల్‌లో ఇటీవల కాలంలో తరుచుగా బాంబుపేలుళ్లు జరుగుతున్నాయి. ఈ బాంబుపేలుళ్లు ఎక్కువగా దేశ రాజధాని ఖాట్మండూలోనే జరిగాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|