యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముషారఫ్ అవసరం లేదు : అమెరికాతో గిలానీ
ఇస్లామాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008   ( 17:20 IST )
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ సేవలు దేశానికి అవసరం లేదని అమెరికాతో పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ చెప్పారు. దేశ అవసరాలను పణంగా పెట్టినందువల్ల ఆయనంటే ప్రజల్లో వ్యతిరేక భావన వ్యక్తమవుతుందని తెలిపారు. అమెరికా పర్యటనకు గిలానీ ఇటీవల వెళ్లిన సమయంలో యూఎస్ పాలనా యంత్రాంగంతో ఈ విషయాలపై చర్చించారని వార్తలు వస్తున్నాయి.

ముషారఫ్‌ను పదవి నుంచి తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బుష్ అంగీకరించారని తెలుస్తోంది. ముషారఫ్‌ను పక్కనబెట్టి పాకిస్థాన్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వం పనిచేయటానికి బుష్ మెగ్గుచూపుతున్నారని గిలానీ అన్నారు.

పాకిస్థాన్ దేశాన్ని ముందుకు నడిపించే దానిలో పర్వేజ్ ముషారఫ్ పాత్ర ఏమీ లేదని సర్వాధికారాలు ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయని గిలానీ చెప్పారు. పాకిస్థాన్‌కి పార్లమెంటరీ వ్యవస్థ సరైనదని గతంలో ఎన్నోసార్లు రుజువైందన్నారు. సైనిక నియంతలకు మద్దతునివ్వటానికి పాకిస్థాన్ ప్రజలు ఆసక్తి కనబరచటం లేదని అమెరికా అంటోందని గిలానీ వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముష్ అభిసంశన: అధికార పక్షాల మధ్య ఏకాభిప్రాయం
అమెరికా అధ్యక్ష పదవి రేసులో తారాతోరణం
న్యూజీలాండ్‌లో తప్పిపోయిన వారెమయ్యారు
పాక్‌లో ఆత్మాహుతి దాడులకు సిద్ధం : తాలిబన్
హిరోషిమా మృతులకు జపాన్ ప్రజల నివాళి
అర్ధాంతరంగా ముగిసిన జర్దారీ, షరీఫ్ చర్చలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...