|
| ముష్ అభిశంసన: అధికార పక్షాల మధ్య ఏకాభిప్రాయం |
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ అభిసంశనపై పాకిస్థాన్ అధికార పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అధ్యక్షుడు ముషారఫ్ అభిశంసనతో పాటు, న్యాయమూర్తుల పునర్నియామకంపై పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన పీపీపీ, పీఎంఎల్- ఎన్ మధ్య ఎట్టకేలకు ఒక అవగాహన సాధ్యపడింది.
పాకిస్థాన్ ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై పీపీపీతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని పీఎంఎల్- ఎన్ నాయకులు అన్నారు. రెండు పక్షాలు ఈ విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయని తెలిపారు. సింథ్ హైకోర్టు న్యాయమూర్తులను అధ్యక్షుడు ముషారఫ్ గత ఏడాది తొలగించారని వివరించారు.
న్యాయమూర్తుల పునర్నియామకం జరిగిన తర్వాత అధ్యక్షుడు ముషారఫ్ అభిశంసన పని చేపడతామన్నారు. బహుశా ఈ పని రోజుల్లోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|