యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
న్యూజీలాండ్‌లో తప్పిపోయిన వారెమయ్యారు
మెల్‌బోర్న్‌, గురువారం, 7 ఆగస్టు 2008   ( 12:15 IST )
వివిధ విసాలపై న్యూజిలాండ్‌కు వెళ్ళి ఆచూకీ లేకుండా పోయిన 34 మంది భారతీయలు ఏమయ్యారనేది ప్రశార్థకంగా మిగులుతోంది. మరోవైపు వారిని పట్టుకుని భారత్‌కు పంపివేస్తామని న్యూజీలాండ్ హెచ్చరికలు జారీ చేస్తోంది. కనిపించకుండా పోయిన 34 మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

గత నెలలో
సిడ్నీలో జరిగిన పోప్‌ వరల్డ్‌ యూత్‌ దినోత్సవాల్లో పాల్గొనేందుకు 200 మంది భారతీయులు అక్కడకు బయలుదేరి వెళ్ళారు. వారిలో 40 మంది మధ్యలో న్యూజిలాండ్‌లోనే ఆగిపోయారు. అందులో మళ్ళీ నలుగురు కొన్ని రోజుల తరువాత భారత్‌కు చేరుకున్నారు. ఇలా భారత్‌ను చేరుకున్న వారు కాకుండా అక్కడే ఇంకా 34 మంది మిగిలిపోయారు.

వీరంతా టూర్ వీసాలపై అక్కడకు చేరుకున్నావారే కావడం విశేషం. ఏజెంటు వారిని బుట్టలో వేసుకున్నారు. ట్రూర్ వీసాలతోనైనా శాశ్వతంగా న్యూజిలాండ్‌లోనే ఉండిపోవచ్చని నమ్మబలికాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి కనీసం 13వేల అమెరికన్‌ డాలర్లు వసూలు చేశాడని వారు వాపోతున్నారు.

కాగా బుధవారంతో కొందరికి వీసా గడువు పూర్తయ్యింది. గురువారంతో మరికొందరికి వీసాల గడువు తీరిపోనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జాడలేని భారతీయులకు హెచ్చరికలు జారీ చేశారు. వారిని పట్టుకుని భారత్‌ పంపేస్తామని, మళ్లీ ఐదేళ్ల పాటు న్యూజిలాండ్‌కు అనుమతించబోమని పేర్కొన్నారు. .
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌లో ఆత్మాహుతి దాడులకు సిద్ధం : తాలిబన్
హిరోషిమా మృతులకు జపాన్ ప్రజల నివాళి
అర్ధాంతరంగా ముగిసిన జర్దారీ, షరీఫ్ చర్చలు
ఇండోనేషియాలో ఐదు మంది భారతీయల అరెస్టు
చైనా పర్యటన రద్దు చేసుకున్న ముషార్రఫ్
చైనాలో భూకంపం: ఒకరి మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...