|
| పాక్‌లో ఆత్మాహుతి దాడులకు సిద్ధం : తాలిబన్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 18:12 IST ) | |
సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సైనిక చర్యలను వెంటనే ఆపివేయకపోతే పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తామంటూ తాలిబన్ తీవ్రవాద సంస్థ హెచ్చరికలు జారీచేసింది. పాక్ మొత్తం మీద తమ ఆత్మాహుతి బాంబులు ఇందుకోసం సిద్ధంగా ఉన్నారంటూ ఆ సంస్థ పేర్కొంది.
ఈ విషయమై తాలిబన్ తీవ్రవాద సంస్థకు చెందిన నేత ఒకరు మాట్లాడుతూ పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ సరిహద్దులో అత్యాధునిక యాంటీ ఎయిర్‌క్రాప్ట్, క్షిపణీ వ్యవస్ధను తాము సిద్ధం చేసినట్టుగా పేర్కొన్నారు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో నాటో దళాలు, అఫ్ఘన్ జాతీయ సైన్యం ఏదైనా చర్యలకు పూనుకుంటే తమ ప్రతాపం చూపుతామని ఆయన అన్నారు.
ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకోల్పేందుకు ఒప్పందం ప్రకారం తాము నడుచుకుంటున్నామని అయితే ఆయా ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో విఫలం చెందాయని ఆయన విమర్శించారు. ఒప్పందం ప్రకారం నడుచుకోకపోతే పాక్‌లోని కరాచీ తదితర అన్ని ప్రముఖ ప్రదేశాల్లో తాము ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని ఆయన అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|