యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అర్ధాంతరంగా ముగిసిన జర్దారీ, షరీఫ్ చర్చలు
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భవితవ్యాన్ని తేల్చేందుకు ఉద్దేశించిన పీపీపీ, పీఎంఎల్-ఎన్ అధినేతల మధ్య మంగళవారం జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దాదాపు 6 గంటలసేపు ఏకధాటిగా జరిగిన సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తిరిగి బుధవారం సమావేశం కావాలని నిర్ణయించారు.

పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ 2008లో ఎన్నికైన పార్లమెంటు విశ్వాసాన్ని పొందాల్సి ఉంది. ఈయన పదవి నుంచి దింపేందుకు ఇటు పీపీపీ సహాధ్యక్షుడు ఆసీఫ్ ఆలీ జర్దారీ, అటు పీఎంఎల్-ఎన్ నేత నవాజ్ షరీఫ్‌లు సర్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ కూడా సరియైన మెజారిటీ లేదు. రెండు పార్టీలు చేతులు కలిపితే తప్ప ముషార్రఫ్‌పై అభిశంసన ప్రవేశపెట్టలేరు.

ఇందుకోసం రెండు పార్టీలు కసరత్తు మొదలు పెట్టారు. ఇద్దరు నేతుల అధ్యక్షుడిపై అభిశంసన, న్యాయమూర్తుల పునర్నియామకాలపై సుధీర్ఘ చర్చ జరిపారు. చర్చ పూర్తయిన తరువాత ఇద్దరు కలిసి పాత్రికేయులతో మాట్లాడుతారని అందరూ ఆశించారు. అయితే అలాంటిదేమి జరగలేదు. సమావేశం తరువాత బయట వచ్చిన నవాజ్ షరీఫ్ చాలా తొందరగా అక్కడ నుంచి వెళ్ళి పోయారు. వారి కోసం వేచి ఉన్న మీడియా సభ్యలతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

పూర్తి ప్రయోజనాల కోసం రెండు పార్టీలు మరోమారు సమావేశం కానున్నాయి. సోమవారం నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ ముషార్రఫ్, న్యాయమూర్తుల విషయంలో నిర్ణయాత్మక తీర్మానాలుంటాయని చెప్పారు. అయితే మంగళవారం నాటి చర్చల్లో ఇలాంటివి ఏమి కనిపించలేదు. తీర్మానాలను బుధవారం నాటి వాయిదా వేశారు. ఆ సమావేశంలో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇండోనేషియాలో ఐదు మంది భారతీయల అరెస్టు
చైనా పర్యటన రద్దు చేసుకున్న ముషార్రఫ్
చైనాలో భూకంపం: ఒకరి మృతి
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...