యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనా పర్యటన రద్దు చేసుకున్న ముషార్రఫ్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008   ( 13:23 IST )
ప్రతిష్టాత్మకంగా జరిగే ఒలంపిక్ గేమ్స్‌ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చైనా ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రముఖులను ఆహ్వానించారు. ఇదే కార్యక్రమానికి ముషార్రఫ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా ఆయన తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పదవికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

విదేశీ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి మహమ్మద్ సాధిక్ విలేకరులతో మాట్లాడుతూ, పాలక సంకీర్ణం ఆయనను విశ్వాసం కోరనుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నవాజ్‌షరీఫ్ పార్టీ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకులు సమావేశం కానున్నారు. ఇది పూర్తిగా ఆయన పదవికి ముప్పుతెచ్చి పెట్టే ప్రమాదం ఉంది.

పాకిస్థాన్ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. ఒక వైపు తనను సాగనంపడానికి తన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు ముషార్రఫ్ కూడా రాజ్యాంగ, న్యాయనిపుణులతో రావల్పిండిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తనను తాను కాపాడుకునేందుకు వ్యూహరచన చేయనున్నారు. ఇందులో భాగంగానే చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనాలో భూకంపం: ఒకరి మృతి
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...