యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ఖట్మాండు (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008   ( 17:42 IST )
నేపాల్‌లో ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు నాలుగు ప్రధాన పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే ఇంత వరకూ పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీపీఎన్-మావోయిస్ట్, నేపాల్ కాంగ్రెస్, సీపీఎన్-యూఎన్ఎల్, మాదేశీ పీపుల్స్ రైట్ ఫోరమ్‌లు సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాయి. మాజీ తిరుగుబాటుదారుల నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్జున్ నార్సింగా ఖట్రీ చట్రీ తెలిపారు.

మావోయిస్టులకు, మధ్యంతర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాలనే అమలు జరపాలని నిర్ణయించారు. అన్ని పార్టీలు దాదాపు ఒకే నిర్ణయానికి వచ్చాయని చెప్పారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఖరారు చేసేందుకు అన్ని పార్టీల సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మావోయిస్టు పార్టీ రూపొందించిన 50 అంశాల కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని మిగిలిన మూడు పార్టీలు తిరస్కరించాయి. కొత్త ప్రతిపాదనలను మావోయిస్టు పార్టీ ఎదుట ఉంచాయి. కొత్త కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు మావోయిస్టులు ఒప్పుకున్నారన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు
ఐఎస్ఐపై విమర్శలు పాకిస్థాన్‌పై కుట్రే : ముషార్రఫ్
కొత్త మెరైన్ ఆయుధాన్ని పరీక్షించిన ఇరాన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...