యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
ఇస్లామాబాద్, 5 ఆగస్టు 2008   ( 16:51 IST )
పాకిస్థాన్‌ పార్లమెంటు విశ్వాసం పొందాలని దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను అధికారంలో ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కోరే అవకాశం ఉంది. ఇందుకోసం తన సంకీర్ణంలోని పిఎంఎల్-ఎన్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తిగా పిఎంఎల్-ఎన్‌పై ఆధారపడి ఉంది.

సంకీర్ణాన్ని కాపాడుకుంటూనే ముషార్రఫ్‌ను బయటకు పంపే మార్గాలను అన్వేషిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశంలో వివిధ చోట్ల తొలగించిన న్యాయమూర్తులను తిరిగి నియమించే దిశగా ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు పీపీపీ అగ్రనేతలు సోమవారం సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.

అలాగే పీపీపీ సహాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పీఎల్ ఎం-ఎన్ నేత నవాజ్ షరీఫ్‌లు మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా సంకీర్ణంపై చర్చజరుగుతుంది. భవిష్యత్తులో వారి మధ్య సంకీర్ణ నిర్ణయం కుదిరితే వారి చూపు ముషర్రఫ్ వైపు మళ్ళుతుంది.

అయితే న్యాయమూర్తుల పునర్నియామకం విషయంలో రెండు పార్టీల మధ్య కాస్తా తేడాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో చర్చ జరిగి ఆ నిర్ణయం మేరకే న్యాయమూర్తుల పునర్నియామకం జరగాలని వాదిస్తోంది. ఇక్కడ రాజీ కుదిరితే 2008 సాధారణ ఎన్నికల ప్రకారం ముషార్రఫ్ పార్లమెంటు విశ్వాసం పొందాల్సి ఉంటుంది. ఇది ఆయనకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్లే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు
ఐఎస్ఐపై విమర్శలు పాకిస్థాన్‌పై కుట్రే : ముషార్రఫ్
కొత్త మెరైన్ ఆయుధాన్ని పరీక్షించిన ఇరాన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...