|
| సెప్టెంబర్ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్ |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008 ( 15:38 IST ) | |
అమెరికా-భారత పౌర అణు ఒప్పందం భారత్‌లో గట్టెక్కింది. ఎన్నో గందరగోళ పరిస్థితుల అనంతరం మన్మోహన్ సింగ్ అణు ఒప్పందానికి ఏదో ఒక విధంగా ఓకే అనిపించగలిగారు. అయితే ఇప్పుడు అణు ఒప్పందంపై యూఎస్ కాంగ్రెస్‌లో చర్చ జరుగనున్నది. ఇక్కడ కూడా సవా లక్ష అనుమానాలున్నాయి.
వాటన్నింటి నుంచి బయటపడుతుందని బుష్ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇందుకోసం మూహర్తం కూడా నిర్ణయించారు. సెప్టెంబరు 8న కాంగ్రెస్ ఎదుటకు అణు ఒప్పందం రానున్నది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌లో కాస్తంత ఆందోళన ఉంది. అయినా సరే సాధించగలమనే నమ్మకంతో ఉన్నారు.
తాము కాంగ్రెస్ దీనిని ఆమోదిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. ఆగస్టు 21న 45 ఎన్ఎస్జీ సభ్యులతో వియన్నాలో చర్చించనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా అణు భద్రతా పరంగా కూడా ప్రపంచానికి చాలా ఉపయోగకరమని ఇప్పటికే నచ్చజెప్పినట్లు వివరించారు. ఐఏఇఏ ఒప్పందంపై వచ్చే నెలలో సానుకూల స్పందన, ఫలితం లభిస్తుందని ఆయన ఆశించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|