|
| బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు |
| ఢాకా, మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 12:28 IST ) | |
ఆస్తుల వివరాలను తెలపకుండా సమాచారాన్ని దాచిపెట్టారని, అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారన్న కారణాలను చూపుతూ, బంగ్లాదేశ్ అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు సోమవారం ఒక మాజీ మంత్రికి 13 ఏళ్లు శిక్ష విధించింది. 10 లక్షల టాకాల జరిమానా విధించింది. ప్రధాని ఖలీదా జియా(బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) ప్రభుత్వంలో ఎం.మర్షిద్ ఖాన్ మంత్రిగా పని చేశారు.
ప్రభుత్వం మారిన తరువాత ఆయన అనేక విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఇందులో భాగంగా అవినిరోధక అధికారుల కేసు నమోదు చేశారు. దీనిపై పార్లమెంటు ఆవరణలో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కోర్టులో విచారణలు జరిగిన మీదట 82 లక్షల టాకాల విలువ చేసే అక్రమ ఆస్తులను ముర్షిద్‌ఖాన్ నుంచి జప్తు చేయాలని న్యాయ మూర్తి ఆదేశించారు.
13 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆయన మరో ఏడాది అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ముర్షిద్ ఖాన్ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్‌లో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం 2007 జనవరి 11న దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అప్పటి నుంచి ముర్షిద్ ఖాన్ దేశం విడిచి వెళ్లిపోయారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|