|
| ఐఎస్ఐపై విమర్శలు పాకిస్థాన్‌పై కుట్రే : ముషార్రఫ్ |
| ఇస్లామాబాద్, మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 12:06 IST ) | |
పాకిస్థాన్‌పై కుట్రలో భాగంగానే బారత్, అమెరికా, ఆప్ఘానిస్థాన్లు ఐఎస్ఐపై విమర్శులు గుప్పిస్తున్నాయని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ విమర్శించారు. పాకిస్థాన్‌ను రక్షించడంలో ఐఎస్ఐ మొదటి వరుసలో ఉందన్నారు. తనను అమెరికా విధేయుడుగా ఆరోపిస్తున్న విమర్శకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆది, సోమవారాల్లో కరాచీలో వాపారవేత్తలను, క్వెట్టాలోని గవర్నర్ నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి ముషార్రఫ్ మాట్లాడారు. దేశ సుస్థిరంగా ఉంచడమలో ఐఎస్‌ఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దానిని విమర్శిస్తే పాకిస్థాన్‌ను, దాని సైనిక బలగాలను, ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపరచడమేనని చెప్పారు.
పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే భారత్ ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని విమర్శించారు. బలూచిస్థాన్‌లో హింసకు భారత దేశమై కారణమన్నారు. అక్కడి వారికి భారత్ ఆయుధాలు, యుద్ధసామగ్రిని సరఫరా చ్తేసోందని విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|