|
| కొత్త మెరైన్ ఆయుధాన్ని పరీక్షించిన ఇరాన్ |
| టెహ్రాన్ (ఏజెన్సీ), 4 ఆగస్టు 2008 ( 15:37 IST ) | |
ఇరాన్ సముద్రంపై ఉపయోగించే కొత్త నౌకావిధ్వంసక ఆయుధ పరీక్షలు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇరాన్ కేంద్రీయ భద్రతా దళాల చీఫ్ ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏకు వెల్లడించారు. ఇరాన్ తాజాగా పరీక్షించి చూసిన కొత్త ఆయుధం ప్రపంచంలో మరే దేశం వద్దా లేదని కమాండర్ జనరల్ మొహమ్మద్ అలి జఫారీ తెలిపారు.
ఈ ఆయుధం 300 కిలోమీటర్ల (186 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను చేధించగలదని చెప్పారు. ఈ మేరకు ఐఆర్ఎన్ఏ సోమవారం వార్తలు వెల్లడించింది. ఈ ఆయుధ పరీక్షను ఎక్కడ, ఎప్పుడు నిర్వహించారనే దానిపై ఆయన ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
ఇరాన్ కేంద్ర భద్రతా దళం ఈ ఏడాది జులైలో కొన్ని క్షిపణులు, నౌకావిధ్వంసక ఆయుధాల పరీక్షలు నిర్వహించింది. వీటిలో కొత్త సాహబ్ క్షిపణి 2012 కిలోమీటర్ల (1250 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. కొత్తగా ప్రయోగించానని ఇరాన్ చెబుతున్న ఆయుధం కూడా అదే తరహా నౌకావిధ్వంసక ఆయుధం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|