|
| శ్రీలంక: ఎల్టీటీఈ అక్రమ రవాణా విభాగ నేత అరెస్ట్ |
| రామనాథపురం (ఏజెన్సీ), సోమవారం, 4 ఆగస్టు 2008 ( 15:12 IST ) | |
ఎల్టీటీఈ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కృష్ణనీథన్‌ను తమిళనాడులోని మదురై జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లాలోని ఉచపట్టి శరణార్థి శిబిరంలో కృష్ణనీథన్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కృష్ణనీథన్ సోదరుడు విజయనీథన్‌ను, మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. స్విజ్జర్లాండ్‌లో తయారుచేసిన వాకీటాకీలు, 10 జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్), బ్యాటరీలు, లైఫ్‌జాకెట్లు, మల్టీటెస్టర్ మీటర్లను స్మిగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ వీరు ఈ నెల 30న కీళకరై సమీపంలోని ఉప్పూర్ వద్ద అరెస్టు అయ్యారు.
ఎల్టీటీఈ నావికా దళ విభాగ కమాండర్ శ్రీనివాసన్ మేనల్లుడు కృష్ణనీథన్‌ను తమిళనాడు పోలీసుల క్యూ బ్రాంచ్ నిఘా విభాగం అరెస్టు చేసింది. పోలీసుల చేతికి చిక్కిన కృష్ణనీథన్, విజయనీథన్, రక్షానందన్, శివరామన్‌లు శ్రీలంక నుంచి శరణార్థుల ముసుగులో ఇక్కడికి వచ్చారని పోలీసులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|