యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
రష్యా రచయిత, నోబెల్ గ్రహీత సోల్జెనిట్సిన్ మరణం
మాస్కో (ఏజెన్సీ), 4 ఆగస్టు 2008   ( 13:52 IST )
రష్యా రచయిత అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (89) మరణించినట్టు సోమవారం ఇక్కడి మీడియా వెల్లడించింది. సోల్జెనిట్సిన్ ఆదివారం గుండెపోటుతో మరణించారని ఆయన కుమారుడు స్టెపాన్ తెలిపారు. కార్మికుల విషయంలో సోవియట్ యూనియన్ విధానాలను ఎండగడుతూ చేసిన రచనలకుగానూ 1970లో సోల్జెనిట్సిన్‌ను నోబెల్ బహుమతి వరించింది.

అనంతరం ప్రచ్ఛన్న యుద్ధ ప్రతీకగా మారినందుకు సోవియట్ యూనియన్ ఆయనను 1974లో దేశం నుంచి బహిష్కరించింది. సోల్జెనిట్సిన్ నవలా రచనల్లో ఒన్ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్, ది ఫస్ట్ సర్కిల్, ది గులాగ్ ఆర్చిపెలాగో అత్యంత ఆదరణ పొందాయి.

సోవియట్ యూనియన్ ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించిన అనంతరం ఇరవై ఏళ్లు ఈ రష్యన్ సాహితీ దిగ్గజం జర్మనీ, స్విజ్జర్లాండ్, అమెరికా దేశాల్లో గడిపారు. 1994లో ఆయన తిరిగి రష్యా వచ్చారు. గత ఏడాది జూన్‌లో రష్యా ప్రభుత్వం అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్‌కు ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనాలో పోలీసులపై దాడి: 16 మంది సిబ్బంది మృతి
ఐఎస్ఐని అదుపులో పెట్టండి: పాక్‌కు అమెరికా విజ్ఞప్తి
శ్రీలంకలో ఘర్షణలు: 18 మంది తీవ్రవాదులు మృతి
భారత దౌత్యకార్యాలంపై దాడి: దర్యాప్తుకు పాక్ ఓకే
అణు కార్యక్రమాన్ని నిలిపివేయబోము: అహ్మదీనెజాద్
కలిసి కట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం : మన్మోహన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...