|
| యూఎన్ హ్యూమన్ రైట్స్ చీఫ్‌గా భారత మహిళ |
| ఐక్యరాజ్యసమితి (ఏజెన్సీ), 25 జులై 2008 ( 12:06 IST ) | |
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కొత్త చీఫ్‌గా భారత సంతతికి చెందిన నవనీతం పిళ్లై ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలోని 192మంది సభ్యులు గల జనరల్ అసెంబ్లీ వచ్చే సోమవారం పిళ్లై ఎంపికను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటోన్న 67ఏళ్ల పిళ్లై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నందు లాయర్‌గా కొనసాగుతున్నారు. ఐక్యరాజ్య సమతిలోని సభ్యుల బృంధం పిళ్లైను మానవ హక్కులు చీఫ్‌గా ఎన్నుకోవడాన్ని అమెరికా ఓ దశలో వ్యతిరేకించింది. అయితే చివరకు అమెరికా సైతం ఆమె అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి.
దీంతో సోమవారం జరిగే ఎన్నిక కార్యక్రమంలో మానవహక్కుల చీఫ్‌గా పిళ్లై ఎంపిక లాంఛనప్రాయం కానుంది. భారత్‌లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన నవనీతం పిళ్లై కుటుంబం దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. ఈ క్రమంలో లా చదివిన పిళ్లై దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి మహిళగా ఘనత సాధించారు. దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రొవెన్స్ నందు 1968లో ఆమె తన ప్రాక్టీస్ ప్రారంభించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|