యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తీవ్రవాదంపై పోరుకు మరింత సహకారం అవసరం : గిలానీ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 11:26 IST )
సరిహద్దు తీవ్రవాదంపై పోరుసాగించడానికి భారత్ నుంచి మరింత సహకారం అవసరమని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఇరు దేశాల మధ్య సహకారం కోరూతూ భారత ప్రధానికి ఆయన ఫోన్ చేశారు.

ఈ విషయమై న్యూఢిల్లీలోని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రధాని మన్మోహన్‌కు ఫోన్ చేసిన గిలానీ గత మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొందినందుకు ఆయనను అభినందించారు. మన్మోహన్ సాధించిన ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు.

అనంతరం ఇరు దేశాలకు సమస్యగా మారిన తీవ్రవాదం గురించి గిలానీ మాట్లాడుతూ తీవ్రవాదుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాలు తీవ్రవాదుల దాడులతో సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్న ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ మాట్లాడతూ భారత్, పాకిస్థాన్ మధ్య సమస్యలకు కారణమవుతున్న కాశ్మీర్ సమస్య, తీవ్రవాదంతో సహా అన్ని సమస్యలన స్నేహపూర్వక వాతావరణంలోనే పరిస్కరించుకునేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దలైలామా పాఠశాలలపై చైనా కన్నెర్ర
హిట్ లిస్ట్ తయారు చేసిన పాకిస్థాన్ తాలిబాన్లు
జపాన్‌లో భారీ భూకంపం: అనేక మందికి గాయాలు
ఐఏఈఏ- భారత్ అణు ఒప్పందంపై పాక్ అభ్యంతరం
అణు ఒప్పందం సకాలంలో పూర్తవుతుంది: అమెరికా
అమెరికా: గవర్నర్‌గా ఉండేందుకే జిందాల్ మొగ్గు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...