|
| దలైలామా పాఠశాలలపై చైనా కన్నెర్ర |
| బీజింగ్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 10:39 IST ) | |
దలైలామాపై కక్ష సాధింపులకు ప్రయత్నిస్తున్న చైనా తాజాగా ఆయనపై మరో రకమైన ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది. దలైలామా వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను వెనక్కు పిలిపించాలని చైనా ప్రభుత్వ ఉద్యోగులను ఆజ్ఞాపించింది.
చైనాకు చెందిన పాలక కమ్యునిస్ట్ పార్టీ కార్యకర్తలకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా చైనా ఈ ఆదేశాలను ఈ నెల 14న విడుదల చేసింది. చైనా విడుదల చేసిన ఈ ఆజ్ఞల ప్రకారం దలైలామాకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను రెండు నెలల లోపుగా వెనక్కు పిలిపించుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలపై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్టు చైనా పేర్కొంది.
టిబెట్‌లోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, మాజీ ఉద్యోగులకు, రాజకీయ కార్యకర్తలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చైనా పేర్కొంది. భారత్‌తో సహా దలైలామా వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న పాఠశాలల్లో 27 వేలమందికి పైగా విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు.
ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఉచితంగా వసతి సౌకర్యాలు అందిస్తన్నారు. కాగా ఈ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు చైనా వ్యతిరేక భావజాలం నూరిపోస్తున్నారని చైనా ఆరోపిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|