|
| హిట్ లిస్ట్ తయారు చేసిన పాకిస్థాన్ తాలిబాన్లు |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 17:16 IST ) | |
రాజకీయ పార్టీల అగ్రనేతలతో కూడిన 300 మంది ప్రముఖులతో తాలిబాన్ తీవ్రవాదులు హిట్‌లిస్ట్ తయారు చేశారనే వార్తలతో పాకిస్థాన్ ప్రభుత్వ భద్రతా, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. స్థానిక తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహ్సూద్ 300 మంది ప్రముఖలతో కూడిన హిట్ లిస్ట్ తయారు చేశారని వార్తలు వచ్చాయి. గత ఏడాది పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యలో మెహ్సూద్‌ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ హిట్ లిస్ట్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, అవామీ నేషనల్ పార్టీ, ముత్తాహిదా ఖవా మూమెంట్ చీఫ్‌లతోపాటు, తాలిబాన్ వ్యతిరేక షియా, సున్నీ వర్గాల మతపెద్దలు ఉన్నట్టు పాకిస్థాన్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నిఘా, న్యాయ వ్యవస్థల్లోని అధికారులు, అంతర్గత వ్యవహారాల శాఖ, ప్రావీన్స్ మంత్రులు, జర్నలిస్టులు కూడా ఈ హిట్ లిస్ట్ ఉన్నారని పాక్ అధికారి ఒకరు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|