|
| అణు ఒప్పందం సకాలంలో పూర్తవుతుంది: అమెరికా |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), 24 జులై 2008 ( 14:54 IST ) | |
అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందం ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందని అమెరికా ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. ఇరుదేశాల ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని పూర్తి చేసి, సకాలంలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెడతాయని వైట్‌హోస్ మీడియా విభాగ కార్యదర్శి డానా ఫెరినో పేర్కొన్నారు.
అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ), అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ)లతో ముడిపడిన ఈ అణు ఒప్పంద ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు భారత్‌కు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా అమెరికా ఈ సందర్భంగా వెల్లడించింది. భారత్ చట్టసభల ప్రతినిధులు ఈ ఒప్పందంపై ముందుకువస్తే ఇక్కడ కూడా తాము ఒప్పందాన్ని వేగవంతం చేసే చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అణు ఒప్పందం విషయంలో నెలకొన్న రాజకీయ వివాదానికి ముగింపు పలుకుతూ భారత్‌లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ నెల 22న పార్లమెంట్‌లో జరిగిన విశ్వాసపరీక్షలో విజయం సాధించడంపై ఫెరినో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా పౌర అణు ఒప్పందం ప్రతి ఒక్కరికీ మంచిదని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|