యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తాలిబాన్‌పై పోరు: పాక్‌లో 15 మంది తీవ్రవాదులు హతం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 16:55 IST )
పాకిస్థాన్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాద సంస్థపై ఇటీవల ప్రారంభించిన పోరులో ఆ దేశ సైన్యం పట్టు బిగిస్తుంది. గత ఐదు రోజులగా తాలిబాన్ తీవ్రవాదులపై పాక్ సైన్యం జరుపుతున్న దాడుల్లో 15 మంది తీవ్రవాదులు మృతి చెందారు. అంతేకాకుండా మరో 60 మంది తీవ్రవాదులను నిర్బంధించామని పాక్ సైన్యం ఆదివారం తెలిపింది.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్యను ఆపకపోతే తమ నిర్బంధంలో ఉన్న 29 మందిని చంపుతామని తాలిబాన్ తీవ్రవాదులు తాజాగా హెచ్చరించారు. తోరవారిలోని తీవ్రవాద స్థావరాలపై పాక్ సైన్యం మోర్టార్లు, హెలికాఫ్టర్లతో దాడులు జరిపిందని సైనికాధికారి ఒకరు టీవీ ఛానళ్లతో చెప్పారు. హంగు జిల్లా సరిహద్దులకు సమీపంలో ఉన్న కుర్రం గిరిజన ప్రాంతంలో పాక్ సైనిక హెలికాఫ్టర్లు మూడు తాలిబాన్ స్థావరాలపై దాడులు జరిపాయి.

హంగు జిల్లాలో తాలిబాన్ తీవ్రవాదులు గతవారం పాక్ పారమిలటరీ దళాలకు చెందిన 15 మంది సిబ్బందిని చంపారు. దీనికి ప్రతిచర్యగా పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారంనాడు ఈ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 1500 మంది సైనికులు ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. గత ఐదు రోజులుగా సైనికులు 15 మంది తీవ్రవాదులను హతమార్చారని, 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోరులో ఐదుగురు సైనికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇరాక్ నుంచి దళాల ఉపసంహరణకు బ్రిటన్ ప్రణాళికలు
నేపాల్: అధ్యక్షుడి ఎంపికపై వీడిపోని ఉత్కంఠ
నేపాల్‌లో ప్రశాంతంగా తొలి అధ్యక్ష ఎన్నికలు
ఐఏఈఏ గవర్నర్లు, ఎన్‌ఎస్‌జీ సభ్యులకు మీనన్ వివరణ
భూకంపంతో జపాన్‌లో సునామీ హెచ్చరికలు
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...