|
| నేపాల్: అధ్యక్షుడి ఎంపికపై వీడిపోని ఉత్కంఠ |
| ఖాట్మండు (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 13:37 IST ) | |
నేపాల్ రాజ్యాంగ సభ ఆ దేశ మొట్టమొదటి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో విజయవంతం కాలేకపోయింది. దీంతో అధ్యక్ష ఎన్నికపై ఆ దేశంలో నెలకొన్న ఉత్కంఠ ఇప్పటికీ వీడిపోలేదు. అధ్యక్ష ఎన్నిక కోసం రాజ్యాంగ సభలో జరిగిన ఓటింగ్‌లో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్ బరన్ యాదవ్‌కు కావలిసిన ఓట్ల కంటే నాలుగు ఓట్లు తక్కువయ్యాయి.
ఇదిలా ఉంటే మాదేశీ పీపుల్స్ రైట్ ఫోరమ్ నేత పరమానంద్ ఝా ఓటింగ్‌లో 312 మంది ఓట్లు పొంది ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పరమానంద్ ఝాకు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) సభ్యుల పూర్తి మద్దతు పొందారు. అధ్యక్ష ఎన్నికలో మావోయిస్టు పార్టీ అభ్యర్థి రామ్‌రాజ్‌రాజా ప్రసాద్ సింగ్‌కు శుక్రవారం వరకు అనుకూల పవనాలు వీచినప్పటికీ, చివరి నిమిషంలో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్- యూఎంఎల్ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో 594 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి యాదవ్ (60) అనూహ్యంగా 294 మంది ఓట్లు పొందారు. అధ్యక్ష ఎన్నికలో విజేతగా నిలిచేందుకు తప్పనిసరిగా 298 మంది సభ్యుల మద్దతు అవసరం కానుండగా, యాదవ్‌కు నాలుగు ఓట్లు తక్కువయ్యాయి. మావోయిస్టు అభ్యర్థి సింగ్ (74) 282 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|