|
| పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 12:25 IST ) | |
పాక్ ప్రభుత్వంతో తమకు ఎటువంటి సమస్యా లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరుదేశాల మద్య సంబంధాలలో తీవ్రవాదంపై పోరు మాత్రమే ప్రధానాంశం కాదని పేర్కొంది.
ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి సీన్ మెక్ కార్మాక్ వాషింగ్టన్‌లో మాట్లాడుతూ అధికారంలో ఎవరున్నారనేది తమకు ముఖ్యం కాదన్నారు. అధ్యక్షుడు ముషారఫ్‌తో పాటు ప్రధాని సహా ప్రభుత్వంలోని ముఖ్యులతో తాము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు.
పాకిస్థాన్‌తో తమకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అది చాలా లోతైన, విస్తృతమైనదని పేర్కొన్నారు. దాన్ని మరింతగా విస్తరించుకోవాలన్నదే తమ ఉద్ధేశ్యమని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|