యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
బౌద్ధ భిక్షువులతో దలైలామా మద్దతుదారుల ఘర్షణ
న్యూయార్క్ (ఏజెన్సీ), 18 జులై 2008   ( 13:21 IST )
టిబెట్ ప్రవాస ప్రభుత్వ నేత దలైలామా మద్దతుదారులు బౌద్ధ భిక్షువులతో ఘర్షణకు దిగారు. టిబెటియన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక బౌద్ధ భిక్షువుల వర్గం ఆరోపిస్తూ ఇక్కడ నిరసనకు దిగింది. వీరిపై దలైలామా మద్దతుదారులు దాడికి దిగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

మాన్‌హట్టన్‌లోని రేడియో సిటీహాలు వెలుపల గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. టిబెటియన్లు, అమెరికాలో ఉంటున్న నేపాల్ జాతీయులు వేల సంఖ్యలో బౌద్ధమతంపై ఒకప్పటి దలైలామా ప్రసంగాన్ని వినేందుకు ఇక్కడకు వచ్చారు. వీరిలో కొంతమంది ఈ ప్రసంగాన్ని వినేందుకు వెయ్యి డాలర్లు చెల్లించారు.

అయితే దలైలామా ప్రసంగాన్ని వినాలని ఇక్కడకు వచ్చిన ఆయన మద్దతుదారుల ఆసక్తికి కొంతమంది నిరసనకారులు భంగం కలిగించారు. అనంతరం నిరసనకారులను చైనా డబ్బులిచ్చి పురమాయించిన వ్యక్తులంటూ దలైలామా మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం తోపులాటకు దారి తీసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
డీఎన్ఏ టెస్ట్‌‌ను తారుమారు చేసే అవకాశం ఉంది: అన్వర్
పాక్‌లో పెరిగిన తీవ్రవాదుల సురక్షిత స్థావరాలు: అమెరికా
ఎన్‌‍‌డబ్ల్యూఎఫ్‌పీలోకి పాక్ సేనలు: ముప్పులేదన్న గిలానీ
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...